స‌లార్ షూరూ.. ఒకే వేదిక‌పై ప్ర‌భాస్‌-య‌శ్!

బాహుబ‌లి ప్ర‌భాస్ హీరోగా, కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌నీల్ డైరెక్ష‌న్‌లో స‌లార్ చిత్రం తెర‌కెక్కుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేజీఎఫ్ హీరో రాకింగ్‌స్టార్ య‌శ్ విచ్చేశారు. అనంత‌రం ప్ర‌భాస్‌-య‌శ్ ఫోటోల‌కు పోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతున్నాయి.

prabhas salaar

భీభ‌త్స‌మైన వ‌యోలెన్స్ యాక్ష‌న్ ప్లాన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. అలాగే పాన్ ఇండియ‌న్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న స‌లార్‌లో ప్ర‌భాస్ విభిన్న‌మైన లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని, సలార్ అంటే స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కోసం పాటుప‌డే వ్య‌క్తి అని డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ ఇంత‌కుముందే తెలిపిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.