సాహూ సినిమా ఫైనల్ కలెక్షన్స్

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో. పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయిన సాహూ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టిన సాహూ, ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. బాహుబలి రికార్డులని కాస్త నాన్ ప్రభాస్ రికార్డ్స్ గా మార్చేసిన సాహూ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఫైనల్ రన్ పూర్తయ్యే సరికి సాహూ సినిమా హిందీ వెర్షన్ 150.6 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది. ఇక తెలుగు వర్షన్ లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఏరియా వైజ్ గమనిస్తే..

నైజం: 29.58కోట్లు
సీడెడ్ : 11.82కోట్లు
ఉత్తరాంధ్ర: 10.19కోట్లు
ఈస్ట్: 7.27కోట్లు
వెస్ట్: 5.92కోట్లు
గుంటూరు: 7.98కోట్లు
కృష్ణ: 5.30కోట్లు
నెల్లూరు: 4.45కోట్లు
కర్ణాటక: 11.66కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.88కోట్లు
యూ ఎస్ ఏ/కెనడా: 11.03కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్: 5.65కోట్లు
మొత్తం తెలుగు వెర్షన్ వసూళ్లు: 112.73కోట్లు (188.3cr+ Gross)
ఇతర బాషల వసూళ్లు కూడా చూస్తే, మొత్తం డబ్బింగ్ వెర్షన్స్ కూడా కలిపితే సాహూ సినిమా ఓవరాల్ గా 218.45కోట్లు రాబట్టింది (406cr గ్రాస్).