ఇప్పట్లో ఆగేలా లేడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా బాక్సాఫీస్ దగ్గర డ్రీమ్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జట్ చిత్రం బాలీవుడ్ లో 125 కోట్ల నెట్ ని రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో ఉత్తరాది ప్రేక్షకులకి చూపిస్తోంది. మొదటి వారాంతానికే బ్రేక్ ఈవెన్ చేరిన సాహూ హిందీ వెర్షన్, బీహార్ లాంటి ఏరియాల్లో ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డే జోష్ కొనసాగిస్తే బాహుబలి 1 సినిమా సాధించిన వసూళ్లని బ్రేక్ చేసేలా కనిపిస్తోంది.

నార్త్ లోనే కాకుండా పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో సాహూ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. మరో అయిదు రోజులు పాటు ఇంకో సినిమా లేకపోవడం సాహూ సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. ప్రీ-రిలీజ్ సాహూ సినిమాని ముందుండి ప్రమోట్ చేసిన ప్రభాస్, ఇప్పుడు పోస్ట్ రిలీజ్ కూడా అదే స్థాయిలో మరోసారి ప్రొమోషన్స్ మొదలుపెడితే సాహూ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.