టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రేజ్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో అలరించనున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్న ప్రభాస్ ఆ తరువాత ప్రాజెక్టులను కూడా అంతే స్పీడ్ గా సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నాడు.
ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పుట్టినరోజున ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ కూడా వస్తోంది. అయితే ఓకేవేళ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఆ సినిమా ఇప్పట్లో రాదట. ముందుగా దర్శకుడు ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాతనే ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ అప్పటిలోపు వైజయంతి, ఆదిపురుష్ సినిమాలను ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి మరి.