Prabhas: ప్ర‌భాస్ సినిమా అప్‌డేట్ రాలేద‌ని ఫ్యాన్స్ ట్వీట్లు.. స్పందించిన నాగ్అశ్విన్‌!

Prabhas: యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌- నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ల‌లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో ఓ అప్‌డేట్ ఇస్తాన‌ని డేట్స్‌తో స‌హా ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. గ‌తేడాదే వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకునే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లెజండ‌రీ అమితాబ్‌బ‌చ్చ‌న్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ను పోషించ‌నున్నారు.

prabhas- nag aswin movie

కాగా సంక్రాంతి పండుగ త‌ర్వాత త‌మ సినిమాకు సంబంధించి ఓ ప్ర‌త్యేక‌మైన అప్‌డేట్ ఇస్తాన‌ని ద‌ర్శ‌కుడు నాగ్అశ్విన్ 2020 డిసెంబ‌ర్ చివ‌రి వారంలో తెలిపాడు. కానీ సంక్రాంతి పండుగ జ‌రిగి చాలా రోజులు కావొస్తున్నా ఎలాంటి అప్‌డేట్ రాక‌పోవ‌డంతో, Prabhas ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడియాలో వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నాగ్అశ్విన్ స్పందించ‌గా.. జ‌న‌వ‌రి 29న కానీ ఫిబ్ర‌వ‌రి 26న కానీ ఖ‌చ్చితంగా త‌మ సినిమా నుంచి అప్‌డేట్ వ‌స్తోంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం Prabhas ప్ర‌భాస్ రాధేశ్యామ్ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా, అనంత‌రం కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌లార్ చిత్రంలో Prabhas ప్ర‌భాస్ న‌టించ‌నున్నాడు.