దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామ్యం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్లో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలను చిరంజీవి పరిచయం చేస్తాడని చెబుతున్నారు. హిందీ వెర్షన్లో ఎన్టీఆర్, చరణ్ పాత్రలను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పరిచయం చేస్తాడని తెలుస్తోంది.
ఒకవేళ చిరంజీవి, అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తే ఈ సినిమా రేంజ్ మరిం పెరగడ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి, చిరంజీవికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం, ఈ సినిమాలో రాంచరణ్ నటిస్తుండటంతో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు చిరంజీవి ఒప్పుకున్నాడట.
ఇక రాజమౌళి, అమీర్ ఖాన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని చాలాసార్లు అమీర్ ఖాన్ చెప్పాడు. దీంతో హిందీ వెర్షన్లో వాయిస్ ఓవర్ చెప్పేందుకు అమీర్ ఖాన్ ఓకే చెప్పాడట. మరి RRR సినిమాలో చిరంజీవి, అమీర్ ఖాన్లు వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియాలి.