‘మ‌నో విరాగి’ ఫ‌స్ట్ లుక్‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న రెండో బయోపిక్ ‘మ‌న్ బైరాగి’. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రివీల్ చేశాడు. హిందీలో మ‌న్ బైరాగి అనే టైటిల్‌ ఖ‌రారు కాగా, తెలుగులో ‘మ‌నో విరాగి’ అనే పేరు ఫైనల్ చేశారు. న‌రేంద్ర మోడీ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. మ‌న్ బైరాగి హిందీ, తెలుగు వెర్ష‌న్ల పోస్ట‌ర్లను ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేస్తూ… ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిపై రూపొందుతోన్న ప్ర‌త్యేక‌మైన సినిమా ఇది, హ్యాపీ బ‌ర్త్ డే న‌రేంద్ర‌మోడీ గారు.. అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. మోదీ జీవితంలో ప్రపంచానికి తెలియని నిజాలని ఈ మూవీలో చూపించబోతున్నారు. మన్ బైరాగి ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.