Prabhas: మీస‌క‌ట్టులో ప్ర‌భాస్ పిక్‌ వైర‌ల్‌.. బాలీవుడ్ మూవీ కోస‌మేనా!

Prabhas: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ ఏకంగా నాలుగు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయ‌న సినిమాలు పాన్ ఇండియా లెవెల్లోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఆయ‌న న‌టించిన చిత్రం రాధేశ్యామ్ జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ఆ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇక ఆయ‌న న‌టిస్తోన్న మ‌రో చిత్రం స‌లార్‌.. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ మొద‌టి షెడ్యూల్‌ను తెలంగాణ‌లోని రామగుండం బొగ్గుగ‌నిలో పూర్తి చేసుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో తీసుకురావ‌ల‌ని ఈ చిత్రబృందం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌.

Prabhas latest

అలాగే Prabhasప్ర‌భాస్ తొలిసారి డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఆదిపురుష్ టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర‌బృందం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులోPrabhas ప్ర‌బాస్ రాముడిగా.. రావ‌ణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషించ‌నున్నారు. అయితే దీంట్లో రాముడి పాత్ర కోసం లేటేస్ట్‌గా ప్ర‌భాస్ క్లీన్ షేవ్ చేసుకుని.. మీస‌క‌ట్టులో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తాజా ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో ఈ ఫోటోను చూసి Prabhasప్ర‌భాస్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా ప‌రిస్థితులు నెలకొన్నాయి. అంత‌లా ఆక‌ట్టుకుంటుంది ప్ర‌భాస్ లేటేస్ట్ ఫోటో. ఇక ప్ర‌భాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ఓ మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దీంట్లో Prabhas ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికాప‌దుకుణే న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్నారు.