Prabhas: ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయ‌నున్న‌ ప్ర‌భాస్..

Prabhas: యంగ్‌రెబెల్ స్టార్‌గా టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌.. ఈశ్వ‌ర్ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ప్ర‌భాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛ‌త్ర‌ప‌తి సినిమాతో్ ప్ర‌భాస్ యంగ్ రెబెల్ స్టార్ ప్రేక్ష‌కుల‌కు మరింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.. ఛ‌త్ర‌ప‌తికి ముందు వ‌చ్చిన చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈ ఛ‌త్ర‌ప‌తి సినిమా ఓ రేంజ్‌లో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ రికార్డులు కొట్టింది. ఇక వీరిద్ద‌రి కాంబోలోనే తెర‌కెక్కిన బాహుబ‌లి చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు Prabhasప్ర‌భాస్‌. ఈ చిత్రం భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.. ఏకంగా 1600కోట్లు బాహుబ‌లి-2 చిత్రం క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దీంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు..

Prabhas Latest

దీంతో ఆయ‌న సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం సాహో. ఈ చిత్రం టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌కున్నా.. హిందీలో మాత్రం ఘ‌న విజ‌యం సాధించింది.. ఏకంగా 150కోట్లు రాబ‌ట్టింది.. ఇక Prabhasప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న రాధేశ్యామ్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు… అలాగే ప్ర‌స్తుతం సెట్స్ మీద ఉన్నా ప్ర‌భాస్‌ చిత్రాలు.. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్లో స‌లార్ చిత్రం కాగా, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం, నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో సైంటిఫిక్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్న చిత్రాల్లోPrabhas ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓంరౌత్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రాముడి క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్ చేస్తున్నాడు అనే విష‌యం తెలిసిందే.. ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో జ‌రుగుతుంది. అయితే ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన నాటి నుంచి పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌భాస్ ఎక్కువ శాతం ముంబైలో్నే గ‌డ‌ప‌నున్నారు. దీంతో అక్క‌డ‌నే ఓ ఫ్లాట్ తీసుకోవాల‌నిPrabhas ప్ర‌భాస్ భావిస్తున్నార‌ట‌. ముంబైలోని ఖ‌రీదైన ప్రాంతంలో ఓ విలాస‌వంత‌మైన ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆయ‌న ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నార‌ట‌. ఈ మేర‌కు ఆయ‌న బృందం ఫ్లాట్ ఎంపిక చేసే ప‌నిలో ఉన్న‌ట్లు ఈ వార్తా బాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ఆదిపురుష్ చిత్రంలోPrabhas ప్ర‌భాస్ రాముడిగా, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు.. సీత‌గా కృతిస‌న‌న్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం..కాగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఆగ‌ష్టు 11న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.