ముంబైలో కల్కి ప్రమోషన్స్ ఇలా జరుగుతున్నాయా…!

ప్రభాస్ హీరోగా నటిస్తూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బన్నెర్స్ నిర్మించిన చిత్రం కల్కి 2898AD. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్, దీపికా పాడుకొనే తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మిథిలాజికల్ ఫ్రిక్షణాల మూవీ గా వస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా టీం ప్రమోషన్స్ లో భాగంగా ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా చేసారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతూ కల్కి సినిమాలో తాను భాగం కావడం తనకి చాలా గర్వంగా ఉంది అన్నారు. ఈ సినిమాతో మంచి అనుభూతి లభించింది అని, జీవితంలో ఎప్పటి మర్చిపోలేను అన్నారు.

కమల్ హస్సన్ మాట్లాడుతూ నాగ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ ను చాలా బాగా హంలే చేసారు అన్నారు. సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేసినట్లు తెలిపారు.

ప్రభాస్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హస్సన్ లాంటి వారితో కలిసి నటించడం తనకు చాలా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు. అటువంటి లెజెండ్స్ తో అలిసి చేయడం కలలో కూడా జరగదు అనుకున్నాను అన్నారు.

దీపిక పదుకొనె మాట్లాడుతూ కల్కి సినిమాలో చేయండి మంచి ఎక్సపీరియెస్ అని, అలాగే ఓ సరికొత్త ప్రపంచంలోకి మాకు వెళ్లినట్లు అనిపించి అన్నారు.