‘కల్కి 2898AD’ కొత్త అప్డేట్

నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD . వైజయంతి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్, దీపికా పాడుకొనే తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇది ఇలా సినిమాకు ఉండగా యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 3 గంటల 56 సెకండ్లు రన్ టైం ఉందని తెలిసింది. సెన్సార్ బోర్డు ప్రతిపాదన మేరకు 1.36 నిమిషాల సీన్స్ను రీప్లేస్మెంట్ చేసినట్లు సర్టిఫికెట్లో ఉంది అని సమాచారం.