అభిమానులను కన్ఫ్యూస్ చేస్తున్న ప్రభాస్ – ‘కల్కి 2898 AD’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కల్కి 2898 AD. ఈ చిత్రంలో దీపికా పాడుకొనే, కమల్ హస్సన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ & ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. బుజ్జి & భైరవ లను పరిచయం చేస్తూ చేసిన ఈవెంట్ మంచి బజ్ తెప్పించింది. అమెజాన్ విడుదల అయినా బుజ్జి & భైరవ అనిమేషన్ వీడియోలకు మంచి స్పందన లభించింది. నిన్న విడుదల అయిన భైరవ అంతెం సాంగ్ మంచిగా ట్రెండ్ అవుతుంది.

ఇది ఇలా ఉండగా ‘కల్కి 2898AD’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు & ఎక్కడ అనే కన్ఫ్యూషన్ ప్రభాస్ అభిమానులలో మొదలైంది. కొంత సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో జరగనుంది అని వార్తలు వినిఇస్తున్నాయి. మరి కొందరు అయితే ఈ సినిమాకు ముఖ్య అతిధిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అంటున్నారు. ప్రభాస్ & పవన్ కళ్యాణ్ లను ఒక్కటే స్టేజి మీద చూడొచ్చని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ కల్కి 2898AD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో చేయడానికి నో చెప్పినట్లు కొంత సమాచారం. తన సినిమాకు ఎటువంటి రాజకీయ రంగులు రావడానికి తనకి ఇష్టం లేదు అని, అందుకే అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ నో చెప్పినట్లు సమాచారం. ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఇంకా ప్రేక్షకులు ఒక కన్ఫ్యూషన్ లో పడ్డాడు. అసలు కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా? ఉంటె ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది ? అనే కన్ఫ్యూషన్ లో అంతా ఉన్నారు.