రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్ర‌భాస్‌!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు రావ‌డంతో హీరో ప్ర‌భాస్ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని చిత్ర‌యూనిట్‌లోని ప్ర‌తిఒక్క‌రికి ఖ‌రీదైన రిస్ట్ వాచీల‌ను కానుక‌గా పంపించ‌డ‌ట‌. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

prabhas gift

ఈ మూవీ షూటింగ్‌ని త్వ‌ర‌గా ముగించాల‌ని తీవ్రంగ కృషి చేస్తున్న చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తిఒక్క‌రి‌కి ప్ర‌భాస్ రిస్ట్ వాచీల‌ను గిఫ్ట్ ఇచ్చి ఆశ్చ‌ర్య ప‌రిచాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ ఆశ్విన్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ సినిమాలో, కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో స‌లార్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. స‌లార్ షూటింగ్ శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.