‘జిమ్ ట్రైనర్’ కి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన ‘ప్రభాస్’!!

బాహుబలి తరువాత ప్రభాస్ ఏ పని చేసినా కూడా నేషనల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ నుంచి తొలి పాన్-ఇండియా స్టార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ మంచి క్రేజ్ అందుకున్నాడు. అసలు విషయానికి వస్తే ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు.

గత కొన్నేళ్లుగా ప్రభాస్ తో ట్రావెల్ అవుతున్న లక్ష్మణ్ ఒక స్నేహితుడిలా మారాడు. ప్రభాస్ కి ఎప్పుడైనా అందుబాటులో ఉంటూ సినిమా సినిమాకు ఆయనకు ఎంతగానో సహాయపడుతున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ విలువైన కారుని లక్ష్మణ్ కి బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో పాటు బహుమతిగా ఇచ్చిన కారుతో ప్రభాస్ ఫొటోలకు స్టిల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయు. ఇక ప్రభాస్ నెక్స్ట్ రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే