Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న బుడ‌త‌డు..

Prabhas: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంతో యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు ప్ర‌భాస్‌. ఈ చిత్రాన్ని ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించేలా ఉంటుంది. అంత‌లా ప్రేక్ష‌కుల మ‌దిలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ గెట‌ప్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.. ఈ క్ర‌మంలో తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ బుడ‌త‌డు సైతం Prabhas బాహుబ‌లికి వీర‌భిమానిగా మారాడు.

prabhas bahubali

ఆ బుడ‌త‌డ‌కు ఇప్పుడు మూడేళ్లు ఉంటాయి.. కాగా ఈ వ‌య‌స్సులోనే 100సార్లు బాహుబ‌లి చిత్రాన్ని చూశాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ బుడ‌త‌డు త‌ల్లి సోష‌ల్ మీడియాలో తెలిపింది. ఒక ఫోటోను కూడా పంచుకుంది. న్యూయార్క్‌లో ఉంటున్న సుప్రియా దోషి అనే మ‌హిళ తాజాగా అమ‌రేంద్ర బాహుబ‌లి గెట‌ప్‌లో ఉన్న త‌న మూడేళ్ల బాబు ఫోటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. Prabhas ప్ర‌భాస్‌.. న్యూయార్క్‌లో మీకో వీరాభిమాని ఉన్నాడు.. మూడేళ్ల వ‌య‌స్సులోనే 100సార్లు మీ బాహుబ‌లి చిత్రాన్ని చూశాడు.. మిమ్మ‌ల్ని ఒక్క‌సారైనా క‌ల‌వాల‌నేది నా మూడేళ్ల చిన్నారి కోరిక అని ఆమె తెలిపింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూ..Prabhas ప్ర‌భాస్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు ఆ అమ‌రేంద్ర బాహుబ‌లి బుడ‌త‌డు.