మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభాస్ చేతుల్లో రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు చాలామంది టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్‌తో యంగ్గర్ ఎన్టీఆర్ ఒక మూవీ చేయనున్నాడనే వార్తలు బయటకి వచ్చాయి.

PRABHAS

అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రభాస్‌ని ప్రశాంత్ నీల్ కలిశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కి కథ చెప్పినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని అంటున్నారు. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ నచ్చితే ప్రభాస్ ఖచ్చితంగా సినిమా చేసే అవకాశముందని టాక్.

ప్రస్తుతం కేజీఎఫ్-2 షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. క్లైమాక్స్ సీన్స్‌ను ఈ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇటీవలే కేజీఎఫ్ హీరో యశ్ హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ షెడ్యూల్‌తో కేజీఎఫ్-2 షూటింగ్ పూర్తి కానుండగా.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే అవకాశముంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా ఓకే అయిందని సమాచారం. ఇక ఎన్టీఆర్‌తో సినిమా చేసిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశముంది.