Bollywood: ఆదిపురుష్ నుంచి స‌రికొత్త అప్‌డేట్‌..

Bollywood: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగా.. ఈ చిత్రం జూలై 30న రిలీజ్ కానుంది. ఇక ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రాలు.. ఒక‌టి స‌లార్ కాగా, ఆదిపురుష్.. ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ స‌లార్ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోక‌టి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్‌లో రాముడిగా చేయ‌నున్నాడు ప్ర‌భాస్‌. ఇటీవ‌లే Bollywoodఈ చిత్ర షూటింగ్ ముంబైలో ప్రారంభించారు.

Prabhas

ఈ క్ర‌మంలో ఈ చిత్రం షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ కానున్నాడ‌ని స‌మాచారం. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ను నిర్మించారు. దీంట్లో ప్ర‌భాస్ యాక్ష‌న్ సీన్స్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ఇక ఈ చిత్రంలో రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.. సుమారు 500కోట్ల బ‌డ్డెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సీత పాత్ర కోసం Bollywoodబాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్‌ను తీసుకున్న‌ట్లు బాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అలాగే ప్ర‌భాస్ త‌ల్లిగా బాలీవుడ్ అల‌నాటి తార హేమ‌మాలినిని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.