Bollywood: ఆదిపురుష్ అప్‌డేట్‌.. ప్ర‌భాస్ భార్య‌గా, త‌మ్ముడిగా ఎవ‌రంటే..

Bollywood: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న చిత్రాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు ఆయా ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ నేప‌థ్యంలో డైరెక్ట్ బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా చేయ‌నున్న‌ట్లు తెలిసిన విష‌యమే. ఈ Bollywood చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Adhipurush

ఈBollywood చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ ఇచ్చారు చిత్ర‌బృందం. ఈ చిత్రంలో సీత‌గా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్ పోషిస్తున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ వీరిని ఆదిపురుష్ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.