ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో గత కొద్దిరోజులుగా సలార్ షూటింగ్ జరుగుతోంది. కానీ తాజాగా ఈ షూటింగ్ ముగిసింది. హీరో ప్రభాస్‌తో పాటు శృతిహాసన్ ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు.

prabahs salaar shooting completed

షూటింగ్ ముగియడంతో సలార్ యూనిట్ ప్యాక్ అప్ చేశారు. ఈ షూటింగ్‌లో పలు కీలక సన్నివేశాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తు్నారు.