సింగరేణి గడ్డపై ‘సలార్’ ఫైట్ సీన్

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమవ్వగా.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు ఈ సినిమాను నిర్మించనున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో విలన్ పాత్ర కోసం మేకర్స్ పలువురిని సంప్రదిస్తున్నారు.

PRABAHS SALAR SHOOTONH

అయితే సలార్ సినిమాలోని ఒక ఫైటింగ్ సీన్‌ను రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో షూట్ చేయనున్నారు. దీని కోసం ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. బొగ్గుగని ప్రాంతంలో ఫైటింగ్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌లో ప్రభాస్ త్వరలో పాల్గొననున్నాడు.