Powerstar: ‘వ‌కీల్ సాబ్’ నుంచి “కంటి పాప” సాంగ్ రిలీజ్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఉగాది కానుక‌గా ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి సాంగ్స్‌, పోస్ట‌ర్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఎంతో ఫిదా చేశాయి.. ప‌వ‌న్ తెర‌మీద ఎప్పుడెప్పుడా చూస్తామంటూ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇందులో మ‌రోసారి Powerstar ప‌వ‌న్ స‌ర‌సన శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది.

కాగా తాజాగా వీరిద్ద‌రి రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. కంటి పాప అంటూ సాగే పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా.. ఆర్మాన్ మాలిక్ ఈ పాట‌ను ఆలపించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌రాలు అందించారు. ఇక బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో..దిల్ రాజు, బోనీక‌పూర్ ఈ Powerstar చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‌