Powerstar: వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్.. ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న ప‌వ‌ర్‌స్టార్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం వ‌కీల్ సాబ్. ఈ చిత్రం తెర‌పై త్వ‌ర‌లో రానున్న నేప‌థ్యంలో ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ల్లో గూస్‌బంప్స్ నెల‌కొంటున్నాయి..ఈ చిత్రానికి శ్రీ రామ్ వేణు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహ‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య నాగేళ్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. అభిమ‌నుల‌కు అయితే గూస్‌బంప్స్ నెల‌కొన్న ప‌రిస్థితులు క‌నిపించాయి..

Vakeeelsaaab

ఇక ఈ సినిమా ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానున్న నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు.. ఈ నేప‌థ్యంలోనే తాజాగా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.. మిస్ ప‌ల్ల‌వి ఆర్ యూ వ‌ర్జిన్.. విన‌బ‌డేలా చెప్పండి అంటూ ప్ర‌కాశ్‌రాజ్ నివేధాను కోర్టులో ప్ర‌శ్న వేస్తూ ఈ ట్రైల‌ర్ ప్రారంభం కాగా ఎంతో అద్భుతంగా ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది..ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.