Powerstar: 1మిలియ‌న్‌ లైక్స్‌తో దూసుకెళ్తుతున్న వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన వ‌కీల్‌సాబ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు ఈ చిత్ర‌బృందం. ఈ క్ర‌మంలో నిన్న వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది.. ఏకంగా 1మిలియ‌న్స్ లైక్స్‌, 17మిలియ‌న్ వ్యూస్‌తో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ ట్రైల‌ర్‌లో పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్, ప్ర‌కాశ్ రాజ్ మ‌ధ్య వ‌చ్చే కోర్టు సీన్స్ ఎంతో అల‌రిస్తున్నాయి. మీరు వ‌ర్జిన్ క‌దా.. నందాజీ మీరైతే అమ్మాయిల‌ను అడుగుతారు కానీ నేను మాత్రం అబ్బాయిల‌ను అడ‌గ‌కూడ‌దా కూర్చో అంటూ ప‌వ‌న్ చెప్పే డైలాగ్ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది..

Powerstar

ఇక ఈచిత్రం బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పింక్ చిత్రానికి రీమేక్‌గా వ‌స్తున్న ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. నివేధా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగేళ్ల, ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ అందించగా.. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.