Powerstar: గుండెతో స్పందిస్తాడు.. అండ‌గా చెయ్యి అందిస్తాడు ప‌వ‌ర్ ప్యాక్ సాంగ్ రిలీజ్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన చిత్రం వ‌కీల్‌సాబ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్‌, టీజ‌ర్ అభిమానుల‌ను కాకుండా సినీ ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతో అలరించాయి. ఇప్పుడు తాజాగా స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ వ‌కీల్‌సాబ్ చిత్రం నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ సాంగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది.. Powerstar ప‌వ‌ర్‌ప్యాక్డ్‌గా ఓ రేంజ్‌లో దుమ్ములేపుతుంది..

Vakeelsaab

జ‌న‌జ‌న జ‌న‌గ‌న‌మున క‌ల‌గ‌ల‌సిన జ‌న‌మ‌నిషిరా.. మ‌న త‌ర‌పున నిల‌బ‌డే గ‌ల నిజం మ‌నిషిరా.. అంటూ సాగే ఈ పాట‌ను త‌మ‌న్ బాణీల‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌య‌వంత‌మైన పింక్ చిత్రానికి ఇది Powerstarరీమేక్‌గా వ‌స్తుండ‌గా.. ఇందులో శ్రుతిహాస‌న్‌, అంజ‌లి, నివేధా, అన‌న్య నాగేళ్ల కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.. ఇక ఈ Powerstarచిత్రాన్ని ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.