వ‌కీల్‌సాబ్ టీజ‌ర్.. కోటు తీస్తే రౌడీని అంటున్న ప‌వ‌ర్‌స్టార్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రేంజ్ ఏంటీ.. ఆయ‌న‌కున్న ఫాలోయింగ్ ఏంటీ అనేది ప్ర‌త్యేకంగా ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. సినిమాల్లో ప‌వ‌ర్‌స్టార్ క్రేజ్ కా బాప్. హిట్ అయినా ఫ్లాప్ అయినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అంటే అభిమానుల‌కు పండ‌గ.. తాజాగా ఈ సినిమా నుంచి సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇప్పుడు ఈ టీజ‌ర్‌లో ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల‌తో పాటు కొన్ని స‌న్నివేశాల‌ను చూపించారు.

powerstar vakeelsab

ఇక టీజ‌ర్‌లో ప‌వ‌న్ చెప్పే డైలాగ్స్‌.. అబ్జెక్ష‌న్ యువ‌రాన‌ర్ అంటూ కోర్టు హాల్లో త‌న వాగ్ధాటిని ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా కోర్టులో వాదించ‌డ‌మే కాదు, కోటు తీసి కొట్ట‌డం కూడా వ‌చ్చు అంటూ రౌడీల‌ను ఉతికారేయ‌డం ఈ టీజ‌ర్‌లో చూడోచ్చు. ముఖ్యంగా వ‌కీల్‌సాబ్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల అయిన‌ప్పుడు సోష‌ల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. 24గంట‌ల్లో ట్విట్ట‌ర్‌లో హ‌య్యేస్ట్ రీ ట్వీట్స్ సాధించిన సినిమాగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది వ‌కీల్‌సాబ్‌. ఇప్పుడు ప్ర‌స్తుతం టీజ‌ర్ రికార్టుల మోత మొద‌ల‌యింది. ఇక బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ పింక్ రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా.. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప‌వ‌న్ జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తుండ‌గా.. అంజ‌లి, నివేధాథామ‌స్‌, అన‌న్య కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే స‌న్నాహాలు చేస్తున్నారు వ‌కీల్‌సాబ్ చిత్ర‌బృందం.