Powerstar: వ‌కీల్‌సాబ్ అస‌లైన పేరు ఏంటో తెలుసా..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం కు సంబంధించి పోస్ట‌ర్ల్, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కులను, అభిమానుల‌ను ఎంతో అల‌రిస్తున్నాయి. ఇది బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా తెర‌కెక్కుతుండ‌గా.. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌వ‌న్‌కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేసి క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తీర్చిదిద్దారు.

ఇక ఈ Powerstar చిత్రం రిలీజ్ ద‌గ్గ‌ర్లో ఉన్న నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్రమోష‌న్స్ మొద‌లు చేసింది. ఈ క్ర‌మంలో తొలి ప్ర‌మోష‌న్స్ భాగంగా డైరెక్ట‌ర్ శ్రీ రామ్ వేణు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, లిరిక్స్‌సిస్ట్ రామ‌జోగ‌య్య‌శాస్త్రి ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తిక‌ర విష‌యం చెప్పాడు డైరెక్ట‌ర్ శ్రీ రామ్ వేణు. వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌వ‌న్ పాత్ర పేరు స‌త్య‌దేవ్ అంటూ డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు చెప్పారు. అలాగే మొద‌ట టైటిల్ మ‌గువా అనుకున్నామ‌ని ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని Powerstar వ‌కీల్ సాబ్ టైటిల్ ఫిక్స్ చేశామ‌ని తెలిపారు డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు.