Powerstar: భారీ సంస్థానంలో అడుగుపెడుతున్న ప‌వ‌ర్‌స్టార్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్, క్రిష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. పీరియాడిక‌ల్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎమ్‌.ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. వ‌చ్చే వారం నుంచి మ‌రో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది.

దాదాపు ప‌దిరోజుల పాటు సాగ‌నున్న ఈ షెడ్యూల్ కోసం.. Powerstarప‌వ‌న్‌కు సంబంధించిన గండికోట సంస్థానం నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంద‌ట‌.. అందుకోసం భారీ సంస్థానం సెట్‌ను తాజాగా రూపొందించారు. 17వ శ‌తాబ్దం నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దార‌ని స‌మాచారం. ఈ భారీ సంస్థానం సెట్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ రాజీవ‌న్ నేతృత్వంలో రూపొందుతుంది.. ఇక Powerstarఈ సినిమా కోసం ఇప్ప‌టికే హైద‌రాబాద్ శివార్ల‌లో చార్మినార్ సెట్ నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సెలెబ్రిటీస్ జాక్వెలిన్ ఫేర్నాండేజ్‌, అర్జున్ రాంపాల్ ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ Powerstarచిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.