Powerstar: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. శివ‌రాత్రికి ప‌వ‌న్ సినిమా ఫ‌స్ట్‌లుక్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, ప్రముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబోలో పీఎస్‌పీకే 27 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి పీరియాడిక్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏఎం ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం చార్మినార్ సెట్‌, ఓ భారీ సంస్థానం సెట్ల‌ను వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో Powerstarప‌వ‌న్ క‌ళ్యాన్ ఎప్పుడూ చేయ‌ని విధంగా వైవిధ్య‌మైన గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. దీంతో ప‌వ‌న్ అభిమానులు కాకుండా సినీ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

pawan-krish

అలాగే ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఎంతాగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ వార్తాలు వెలువ‌డుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న రిలీజ్ చేస్తార‌ట‌. దీంతో Powerstarప‌వ‌న్ అభిమానుల‌కు ఒక విధంగా గుడ్‌న్యూస్ అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి టైటిల్ హ‌రిహ‌ర మ‌హాదేవ‌, వీర‌మ‌ల్లు అనే రెండు ఫిలింఛాంబ‌ర్‌లో రిజిష్ట‌ర్ చేశారని స‌మాచారం. చివ‌రికి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుగా టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో Powerstarప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ల్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. Powerstarఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.