Vakeelsaab Prerelease: నా గుండె చ‌ప్పుళ్లు మీరు.. ఫ్యాన్స్‌తో ప‌వ‌ర్‌స్టార్!

Vakeelsaab Prerelease: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌లు నిన్న రాత్రి శిల్ప‌క‌ళా వేదిక‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అంజ‌లి, అనన్య‌, దిల్ రాజు, హ‌రీశ్ శంక‌ర్‌, బండ్ల గ‌ణేశ్‌, ఏఎమ్‌ర‌త్నం, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సురేంద‌ర్ రెడ్డి, త‌దిత‌రులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు ఇష్ట‌మైన అభిమాన న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన పాత్ర‌ను నేను చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన దిల్ రాజు, డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గార్ల‌కు ధ‌న్య‌వాదాలు. ఇందులో బ‌ల‌మైన న‌టీన‌టులు న‌టిండం వారితో నేను పోటాపోటీగా న‌టించ‌డం కోసం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌రింత క‌ష్ట‌ప‌డ్డాను. ఇలా ప‌వ‌న్ మాట్లాడుతూ మ‌ధ్య‌లో ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ అర‌వ‌డంతో దీనికి ఆయ‌న స్పందిస్తూ..

Vakeelsaab

సీఎం అనేది జ‌ర‌గాలి.. కోరుకుంటే వ‌చ్చేది కాదు మీ గుండెల్లో స్థానం సంపాదిస్తాన‌ని నేను క‌ల‌గ‌న్నానా? స‌మాజం కోసం దేశం కోసం నా ప‌ని నేను చేసుకుంటూ వెళ్లి పోతున్నాను.. అది ఉన్న‌త‌మైన స్థానం ఇస్తే సంతోషం.. మీ గుండెల్లో స్థానానికి మించిది ఏదీ లేదు అని ఆయ‌న చెప్ప‌గానే.. ఫ్యాన్స్ చ‌ప్ప‌ట్లు, విజిల్ తో ఆడిటోరియం మ్రోత మోగింది. అలాగే ప్ర‌తి నా సినిమాలో దేశ‌భ‌క్తికి సంబంధించిన సాంగ్స్‌, స‌న్నివేశాలు ఉండాలని బ‌లంగా కోరుకునే వ్య‌క్తిని.. దీంతో ఐటెంసాంగ్స్ చేయ‌డం పెద్దగా ఇంట్రెస్ట్ లేకున్నా హ‌రీశ్ శంక‌ర్‌, బండ్ల గ‌ణేశ్ న‌న్ను ఇబ్బంది పెట్టి గ‌బ్బ‌ర్‌సింగ్‌లో కెవ్వుకేక పాట చేయించారు. ఆ పాట చేయ‌లేక చ‌చ్చిపోయాను.. ఏదో క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌వ‌ర్ చేశాను.. ఇక ఈ సినిమా విష‌యానికొస్తే.. ఆడ‌ప‌డుచుల‌కు మేమిచ్చే గౌర‌వంగా చెప్పుకోవ‌చ్చు అంటూ ప‌వ‌న్ అద‌ర‌గొట్టే స్పీచ్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.‌