ప‌వ‌న్ కొత్త మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు ఈ సంక్రాంతికి ఎంతో ఖుషీ ఖుషీగా ఎంజాయ్‌చేస్తున్నారు. గురువారం వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ రావ‌డంతో అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్నాయి. తాజాగా ప‌వ‌న్ కొత్త సినిమా నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చింది. ప‌వ‌న్ చేయ‌బోయే త‌ర్వాతి సినిమా.. అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ చిత్రానికి రీమేక్‌గా వ‌స్తున్న సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌లు అందించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. చిత్ర‌బృందం శుక్ర‌వారం ఓ వీడియోను రిలీజ్ చేసింది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌తో పాటు యువ హీరో రానా కూడా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల ఆఖ‌రిలో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.