పోలీస్ పవర్ @ ఊర్వశి ఓటీటీ

సర్వేశ్వర మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో బహుముఖ ప్రతిభాశాలి శివ జొన్నలగడ్డ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం “పోలీస్ పవర్’. గుద్దేటి బసవప్ప మేరు నిర్మాత. నందిని కపూర్, మల్లిక, చదలవాడ హరిబాబు, మలినేని లక్ష్మయ్య చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఊర్వశి ప్రేక్షకులను ఈనెల 26 నుంచి అలరించనుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ తాలూకు పవర్ ను, మా హీరో కమ్ డైరెక్టర్ శివ జొన్నలగడ్డ టేలెంట్ ను చాటి చెప్పే ‘పోలీస్ పవర్’ యాక్షన్ ఎంటర్టైనర్లు ఇష్టపడేవారందరినీ అలరిస్తుందని నిర్మాత బసవప్ప పేర్కొన్నారు. తమ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తున్న “ఊర్వశి”కి హీరో కమ్ డైరెక్టర్ శివ జొన్నలగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: రేణుకబాబు.ఎ, కెమెరా: బి.ఎస్.కుమార్-బాపు.జి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రారెడ్డి, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, కథ-మాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ జొన్నలగడ్డ