Farmers protests: ప్రియాంక చోప్రాపై రెచ్చిపోయిన పోర్న్‌స్టార్‌..

Farmers protests: కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రైతులు ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో రైతుల‌కు మ‌ద్దతుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందించారు. అయితే ఒక‌వేళ స్పందించ‌క‌పోతే వారిపై దుర్భష‌లాడుతున్నారు. ఇక ఈ విష‌యంపై తాజాగా ప్రియాంక‌చోప్రాపై పోర్న్‌మూవీస్ ద్వారా పాపులారిటీ సంపాదించిన లెబ‌నీస్‌-అమెరిక‌న్ అడ‌ల్ట్ స్టార్ మియా ఖ‌లీఫా రెచ్చిపోయింది. ప్రియాంక‌ను అవ‌మాన ప‌రుస్తూ ట్వీట్ చేసింది.

మిసెస్ జోన‌స్ అని ప్రియాంక చోప్రా జోన‌స్‌ను ప‌రోక్షంగా ప్రస్తావిస్తూ ఒక ప్ర‌శ్న‌ను అడిగింది. Farmers protests రైతు ఉద్య‌మ విష‌యంలో ప్రియాంక చోప్రా ఎందుకు మౌనంగా ఉన్నార‌ని మియా ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించింది. మిసెస్ జోన‌స్ ఏ స‌మ‌యంలోనైనా త‌న మౌనాన్ని వీడ‌బోతున్నారా? నాకు చాలా ఆత్రుత‌గా ఉంది. గ‌తంలో లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభ‌వించిన‌ప్పుడు పాప్ సింగ‌ర్ ష‌కీరా స్పందించ‌లేద‌ట‌.. అలాగే ఇప్పుడు రైతు ఉద్య‌మం జ‌రుగుతున్న‌ప్పుడు ప్రియాంక చోప్రా స్పందించ‌లేద‌ని మియా ఖ‌లీఫా ట్వీట్ చేసింది. ఇక దీంతో సోష‌ల్ మీడియాలో ప్రియాంక అభిమానులు ఈ పోర్న్‌స్టార్‌పై మండిప‌డుతున్నారు. ఎందుకు మండిప‌డుతున్నార‌ట అస‌లు విష‌యం.. Farmers protests రైతు ఉద్య‌మాలు చేస్తున్న‌పుడు ప్రియాంక చోప్రా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రైతు ఉద్య‌మంపై ట్వీట్ చేశారు. మ‌న రైతులు భార‌త్‌కు ఆహారాన్ని అందించే సైనికుల‌ని.. వారి భ‌యాల‌ను తొలగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రియాంక త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.. వారి ఆశ‌ల‌ను నెర‌వేరాల‌న్నారు.. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేలా చూడాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్రియాంక చోప్రా గ‌త ట్వీట్‌ను ప‌ట్టించుకోకుండా మియా ఖ‌లీఫా ఆమెను అవ‌మాన‌ప‌రుస్తూ ట్వీట్ చేసింది. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌రిపై నింద‌లు వేసేట‌ప్పుడు ముందు కాస్త రీసెర్చ్ చేయాల‌ని గ‌తంలో ఏం జ‌రిగిందో తెలుసుకోవాలని రెచ్చిపోతున్నారు ప్రియాంక ఫ్యాన్స్‌.. ఇక ప్రియాంక ప్ర‌స్తుతం హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బిజీ బిజీగా గ‌డుపుతుంది.