సినీ ఇండస్ట్రీతో మరో విషాదం: కరోనాతో ప్రముఖ రచయిత మృతి

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ సెలబ్రెటీలు కరోనా బారిన పడి మరణిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనాతో మరణించగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ మృతి చెందారు. ఆయనే ప్రముఖ మలయాళ కవి, సినీ గేయ రచయిత అనిల్ పనాచూరన్. తాజాగా ఆయన కరోనాతో మృతి చెందారు. తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో కరోనా చికిత్స పొందుతూ మరణించారు.

anil passes away
anil-passes-away

ఆదివారం ఆరోగ్యం విషమంగా మారడంతో తన ఇంటి సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు. అనంతరం తిరువనంతపురంలోని అనయారా హాస్పిటల్‌కి తరలించారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. అనిల్ పనాచూరన్ మృతితో తమిళ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

మలయాళంలో అనేక సినిమాలకు ఆయన గేయ రచయితగా పనిచేశారు. ఆయన పాటలు మలయాళంలో చాలా పాపులర్ అయ్యాయి. అలాగే మలయాళంలో పలు సినిమాల్లో ఆయన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.