పాపం.. పూనమ్ పాండే అంతా పొగోట్టుకుంది

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతూ ఉంటుంది. అలాగే వివాదాలతో నిరంతరం వార్తల్లో ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో పూనమ్ పాండేకు పెద్ద సంఖ్యలో పాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది.

poonam pandey instragram

ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురికావడంతో ఈ హాట్ బ్యూటీ మల్లగుల్లాలు పడుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటను ఎవరో హ్యాక్ చేశారని, అందుకే కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్నట్లు తెలిపింది. తన పాత అకౌంట్‌ నుంచి ఎలాంటి పోస్టులు వచ్చినా.. వాటి గురించి పట్టించుకోవద్దని చెప్పింది. అకౌంట్‌ను మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ అధికారులను సంప్రదించానని, తిరిగి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంది.

యధావిధిగా తన అకౌంట్, ఫాలోవర్స్ తిరిగి వస్తారని ఆశిస్తున్నానంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావడంతో చాలామంది అభిమానులు ట్విట్టర్‌లో తనతో చాటింగ్ చేస్తున్నారని తెలిపింది. కొన్నేళ్లుగా నిజాయితీతో ఎంతోమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నానని, ఇప్పుడు వాళ్లు ఏం అవుతారనే ఆందోళనలో పూనమ్ పాండే ఉంది.