గోవాలో పూనమ్ పాండే అసభ్యకరమైన వీడియో షూట్.. కేసు నమోదు

పూనమ్ పాండే అనే పేరు చాలా వివాదాలతో ముడిపడి ఉంది. పలు న్యూడ్ వీడియోను చిత్రీకరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. నటి పూనమ్ పాండే నటన కాకుండా ఇతర కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె తరచూ సెక్సీ వీడియోలతో అందరికి షాక్ ఇస్తుంటుంది. సోషల్ మీడియా ఖాతాలో ఆమె హాట్ ఫోటోలు మరియు వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల గోవాలో చపోలి ఆనకట్ట వద్ద ఒక వీడియోను చిత్రీకరించారు. ఆ షూట్ అశ్లీలమైన, అసభ్యకరమైనదని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. అటువంటి వీడియో చిత్రీకరణపై ఎఫ్ఐఆర్ కూడా రికార్డ్ చేయబడింది. పూనమ్ పాండేపై గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా శాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై పూనమ్ ఇంకా స్పందించలేదు. తన వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడింది.