Poojahegde: పూజాకు ఇంతామందా ఫాలోవ‌ర్స్‌..

Poojahegde: టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది పూజా హెగ్దే. ఈ జిగేలురాణి తెలుగులో వ‌రుణ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మైన ముకుంద చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ త‌గిన గుర్తింపు రాలేదు.. కానీ ఏమాత్రం డిజ‌ప్పాయింట్ అవ్వ‌కుండా త‌న టైమ్ కోసం వెయిట్ చేసింది పూజా హెగ్దే. ఇక హిందీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌గా స‌క్సెస్ కాకున్నా.. సౌత్ సినిమాల‌పై ఎక్కువ దృష్టిపెట్టింది ఈ భామ‌.

Poojahegde దెబ్బ‌కి బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్స్‌తో అంద‌రి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. గ‌తేడాది వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో చిత్రం ఇండ‌స్ట్రీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డంతో పూజా మ‌రింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే Poojahegde ఈ భామ‌కు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. ప్ర‌స్తుతం పూజాహెగ్దేకు ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ 3మిలియ‌న్స్ మార్క్‌ను చేరుకుంది. కేవ‌లం ట్విట్ట‌ర్లోనే కాదు.. ఫేస్‌బుక్‌లో 5.9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో 12.9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది. కాగా ప్ర‌స్తుతం పూజాహెగ్దే .. ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్‌తో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా కూడా చేస్తూ.. తెలుగులో ఫుల్ బిజీగా మారింది Poojahegde.. అలాగే త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది పూజాహెగ్దే. ఇక బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్‌రోష‌న్‌తో మొహంజోదారో మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా.. గ‌తేడాది హౌస్‌ఫుల్‌-4 సినిమాతో అక్ష‌య్‌కుమార్ జోడీగా హీరోయిన్‌గా తొలి విజ‌యం సాధించింది Poojahegde.