Poojahegde: అల్లు అర్జున్ కథానాయకుడిగా అల..వైకుంఠపురం చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఘన విజయం సాధించింది. అలాగే మ్యూజికల్‌గా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ రికార్డు సృష్టించింది. ఇందులో సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాముల సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా బుట్టబొమ్మ సాంగ్‌లో ఓ సైకిల్‌ను చూసి ఎంతో ఇష్టపడిందట పూజా హెగ్దే.. దీంతో అల వైకుంఠపురం టీమ్ ఆ సైకిల్‌ను పూజాకు గిఫ్ట్ ఇచ్చారంట..
ఈ విషయాన్ని ఇటీవలే పూజా ఓ ఇంటర్వ్యూలో తెలుపుతూPoojahegde.. బుట్టబొమ్మ సాంగ్‌లో సైకిల్‌కు ఫిదా అయ్యాను. అది నాకెంతో నచ్చింది. మొదటిసారి షూట్లో చూడగానే.. చక్కగా అలరించారు.. సైకిల్‌పై మనసు పారేసుకున్నానని తెలుసుకున్న నిర్మాణ బృందం నాకోసం ప్రత్యేకంగా దానిని హైదరాబాద్ నుంచి ముంబాయిలోని తన నివాసంకు పంపించారు. ప్రస్తుతం ఆ సైకిల్‌ను మా నివాసంలో భద్రంగా దాచాను.. ఆ సినిమా నుంచి నాకు లభించిన మధుర జ్ఞాపకమిది అంటూ చెప్పుకొచ్చింది పూజాPoojahegde.