PoojaHegde: క్యార్‌వాన్‌లో పూజాహెగ్దే త‌మ్ముడి ఉచిత స‌ల‌హాలు..

PoojaHegde: ప్ర‌ముఖ హీరోయిన్ పూజాహెగ్దే వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్‌మీదుంది. వ‌రుణ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కిన ముకంద చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది పూజా. అర‌వింద స‌మేత‌, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌, మ‌హ‌ర్షి లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది పూజా.. మ‌రో వైపు త‌న హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో కూడా మంట‌లు పెడుతుంది.. PoojaHegde దీంతో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య భారీగానే ఉంది. అల వైకుంఠ‌పురం చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ అందుకుంది. బాలీవుడ్‌లో కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. హృతిక్‌, అక్ష‌య్ ల‌తోనే న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రాలు.. ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, అఖిల్ మోస్ట్ ఎలిజ్‌బుల్ బ్యాచిల‌ర్‌లో హీరోయిన్‌గా న‌టిస్తుంది పూజాహెగ్దేPoojaHegde. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచ‌ర‌ణ్‌కు జోడీగా పూజాహెగ్దే న‌టిస్తుంది.. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా త‌న క్యార్‌వాన్‌లో త‌న త‌మ్ముడు రిష‌బ్ హెగ్దే ఇటీవ‌లే ప‌ట్టాపొందిన ఆర్థోపెడిషియ‌న్ ఎలా ఎక్స‌ర్సైజ్ చేయాలో ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నాడు అంటూ వీడియో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.