వారికి నడుము పిచ్చి ఎక్కువ.. పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

నాలుగైదు సినిమాలతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రానున్న రాధేశ్యామ్ సినిమాలో ఈ భామ నటిస్తోంది. అయితే తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండియన్ సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సౌత్ ఇండియన్ సినిమా వాళ్లంతా నడుము మత్తులో ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిడ్ డ్రెస్‌లలో హీరోయిన్స్‌ను చూడాలని ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని ఇండస్ట్రీలలో సంచలనంగా మారాయి. అయతే టాలీవుడ్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది అంటున్నారు.

దక్షిణాది సినిమాలతోనే హీరోయిన్‌గా పేరు తెచ్చుకన్న పూజాహెగ్డే ఇక్కడి సినిమాలను చూసి కామెంట్ చేయడం సరికాదని కొంతమంది అంటున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు పూజాహెగ్డే గ్లామర్ పాత్రలు చేయకుండా ఉంటే బాగుండేదని చెబుతున్నారు.