శ్రీవారి సేవలో సినీనటి పూజా హెగ్దే

pooja

ప్రముఖ సినీనటి పూజా హెగ్దే కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వేకువజామున సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మే ఫస్ట్న “రెట్రో” మూవీ విడుదల కానుందన్నారు