
టీ జయ ప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోని మాస్ కాంగ్రెస్ లీడర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల కాలంలో ఆయన నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తుందని అందరికీ తెలిసింది. అయితే ఈ మధ్య “జగ్గారెడ్డి – ఏ వార్ ఆఫ్ లవ్” అనే పేరుతో ఓ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషలలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఓ ప్రేమకథగా ఉండబోతున్నట్లు, ఆ చిత్రంలో ఆయన నిజ జీవిత పాత్రుని సినిమాలో పోషిస్తున్నట్లు త్వరలోనే ఆ చిత్ర వివరాలు వెల్లడిస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇతర అప్డేట్ల విషయం వేచి చూడాల్సిందే.