రాజ్ తరుణ్ పై పోలీస్ కంప్లైంట్ – వైరల్ అవుతున్న లావణ్య కంప్లైంట్

రాజ్ తరుణ్ తనని మోసం చేసాడు అంటూ లావణ్య అనే ఓ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను రాజ్ తరుణ్ సుమారు 11 సంవత్సరాలుగా రేలషన్ లో ఉన్నాం, అయితే గత మూడు నెలలుగా రాజ్ తరుణ్ తానునటిస్తున్న ఒక సినిమా హీరోయిన్ తో రేలషన్ లో ఉన్నాడు. అందుకే తనకు దూరంగా ఉంటున్నాడు ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా తనను రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నారు అని ఆమె తెలిపారు.

“రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి.. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివి.. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నా. రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదు.”