Tamilanadu: న‌టి ఖుష్భుపై పోలీసు కేసు..

Tamilanadu: ప్ర‌ముఖ న‌టి, బీజేపీ నేత ఖుష్భు త‌మిళ‌నాడులోని థౌజెండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆ బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతుంది. అక్క‌డ ఆమె జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌గా.. ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. శుక్ర‌వారం నాడు త‌న నియోజ‌క వ‌ర్గంలో ముమ్మ‌ర ప్ర‌చారం చేప‌ట్టిన ఆమె.. ఓ మ‌సీదు ముందు ప్ర‌చారం నిర్వ‌హిస్తుంది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ప్ర‌కారం..

Kushboo News

ప్రార్థ‌నా స్థ‌లాల ముందు ప్ర‌చారం నిర్వ‌హించ‌డం నిషేధం.. అయితే అక్క‌డ ఆమె ప్ర‌చారం నిర్వ‌హించ‌డ‌మే కాకుండా మ‌సీదు ముందు అధికారుల అనుమ‌తి లేకుండా క‌ర‌ప‌త్రాల‌ను కూడా పంచార‌ట‌.. దీంతో అడిష‌న‌ల్ ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌కు చెందిన ఓ ఆఫీస‌ర్ ఫిర్యాదు మేర‌కు కోడంబాక్కం పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. ఆమెతో పాటు ప‌లువురి నేత‌ల‌పై ఐపీసీ 143, 188సెక్ష‌న్ల కింది కేసు న‌మోదు చేశార‌ట‌.