హింసను ప్రేరేపించిన కేసులో నటుడు అరెస్ట్

హింసను ప్రేరేపించాడనే ఆరోపణలతో పంజాబీ నటుడు దీప్ సిద్దూను పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై సిక్కు జెండాను రైతులు ఎగురవేయడానికి కారణం సిద్దూనేనని, వారిని సిద్దూ ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో తాజాగా చండీఘ‌డ్ – అంబాల మ‌ధ్య ఉన్న జిరాక్‌పూర్‌లో దీప్ సిద్దూను అరెస్టు చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆ ఘటన జరిగినప్పటి నుంచి సిద్దూ కనిపించలేదు. దీంతో సిద్దూతో పాటు జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు.

siddu arrest

రిపబ్లిక్ డే రోజున రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మరడానికి సిద్దూనే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. దీప్ సిద్దూ త‌రుచూ ఓ మ‌హిళా స్నేహితురాలితో ట‌చ్‌లో ఉండేవారని, కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెకు అత‌ను ఎప్పుడూ వీడియోల‌ను పంపేవాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దీప్ పంపిన ఫోటోలు, వీడియోల‌ను.. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ మ‌హిళ అప్‌లోడ్ చేసేద‌ని తేలింది.