Pogaru Release Date: రష్మిక ‘పొగరు’ రిలీజ్ డేట్ ఖరారు

Pogaru Release Date: కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా వస్తున్న ‘Pogaru’ సినిమా విడుదల తేదీ ఖరారు అయింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఈ సినిమా నుంచి విడుదల అయిన ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు’ పాట యూట్యూబ్‌ని షేక్ చేసిన మిలియన్ల వ్యూస్ సాధించింది. సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.ప్రతాప్ రాజు ఈ సినిమాను నిర్మించారు. నంద కిశోర్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు.

rashmika pogaru release date

ఫిబ్రవరి 19న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఈ సినిమాను(Pogaru) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ధృవ సర్జా మాస్ లుక్‌లో ఫైటర్‌గా కనిపించనుండగా.. అతడి వల్ల ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయిగా రష్మిక కనిపించనుంది.