శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ “ప్లే బ్యాక్”..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్.. నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారారు ఈయన. తాజాగా ఆయన రెండవ సినిమా టైటిల్ ప్రకటించారు. ప్లేబ్యాక్ అనే టైటిల్ దీనికి ఖరారు చేశారు దర్శకుడు.

మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లో 1993 మరియు 2019 లైన్స్ ఉన్నాయి. హుషారు ఫేమ్ దినేష్ తేజ్.. మల్లేశం ఫేమ్ అనణ్య ఇందులో జంటగా నటిస్తున్నారు. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. కె బుజ్జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై PNK ప్రసాద్ రావు ప్లేబ్యాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: 
దినేష్ తేజ్, అనణ్య, అర్జున్ కళ్యాణ్, మారుతి, టిఎన్ఆర్, స్పందన పల్లి..

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం:
హరిప్రసాద్ జక్కా
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాత: PNK ప్రసాద్ రావు
సినిమాటోగ్రఫీ: K బుజ్జి