

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రతిభను ప్రదర్శించే వేదిక దొరకదు. అలా ప్రతిభ ఉండి ఆ ప్రతిభను నిరూపించుకునే వాళ్ళ కోసమే నెలకొల్పబడిన సంస్థ పీజే ప్రొడక్షన్స్.
ప్రసాద్ ల్యాబ్ లో పిజే ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని కంటెంట్ లను ప్రదర్శించడం జరిగింది. వాటిలో మొదటిది మీరా పర్వం. స్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం ఒక ఫీచర్ ఫిల్మ్ గా చాలా చక్కగా ఉంది. అలాగే మరో రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శన చేయడం జరిగింది. రాకీ నాగ సాయి దర్శకత్వం చేసిన ఫేడెడ్, గోపీ చంద్ ఎం దర్శకత్వం చేసిన కలలో రాకుమారి సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించారు. ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ లో ఎంతో ప్రతిభావంతులైన వారి టాలెంట్ కనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ దర్శకులు మాట్లాడుతూ నిర్మాత ప్రవీణ్ జోలు గారి సపోర్ట్ వల్లనే వీటిని ఇంత బాగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగిందని అన్నారు.


ఈ సందర్భంగా నిర్మాత ప్రవీణ్ జోలు గారు మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వడమే తమ ఉద్దేశం అని, దానికోసం ఎంతైనా కష్టపడతామని తెలిపారు. అలాగే త్వరలో తమ సంస్థ నుండి ఒక చిత్రం విడుదల కాబోతుందని, ఆ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఆ చిత్రానికి స్వయానా ఈ షార్ట్ ఫిలిమ్స్ నిర్మాత ప్రవీణ్ జోలు గారే రచనా దశకత్వం చేస్తున్నారని, చిత్ర టీజర్ ను ఈ కార్యక్రమం సందర్భంగా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ చిత్ర టీజర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇంస్టాగ్రామ్ లో మీకు అందుబాటులో ఉంటుందని మీరు మీ స్టోరీస్ అక్కడ షేర్ చేయొచ్చని ప్రవీణ్ జోలు అన్నారు.