5 రూపాయల కోసం అడుకుంటున్న పేకమేడలు సినిమా హీరో వినోత్ కిషన్

నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన వినోత్ కిషన్ ఇప్పుడు పేకమేడలు అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రేజీ అంట్స్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమాను రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన టీజర్, ఒక సాంగ్ విడుదల అయ్యాయి. అయితే వాటికి మంచి స్పందనే లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా వినోత్ కిషన్ ఒక సంచల వీడియో తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. తమ సినిమా బాగా వచ్చినప్పటికీ తమ దగ్గర సినిమా ప్రొమోషన్ చేయడానికి లేవు అని, అందరు తమకి తోచినంత సహాయం చేయాలని కోరాడు. సినిమా విడుదల జరిగాక వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను అని, చేసే సాయం 5 రూపాయలు అయిన, 10 రూపాయలు అయిన పరవాలేదు, అది తమకి ఉపయోగ పడుతుంది అని కోరారు. తాను పోస్ట్ చేసిన వీడియోలో ఒక QR కోడ్ తో అడగటం జరిగింది. అయితే ఇది నిజంగానే డబ్బుకోసం చేసిన వీడియోనా లేదా ప్రమోషన్స్ కోసం చేసారా అనేది తెలియాలి ఆటే ఆ QR కోడ్ స్కాన్ చేసి చూడాల్సిందే.