ఆ దర్శకుడు బ్లూ ఫిలిమ్స్ చూపించాడు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రయాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నార్త్ భామ పాయల్ ఘోష్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి అలాగే హీరోల డ్రగ్స్ వాడకం గురించి ఎవరు ఉహీంచని విధంగా స్పందించింది.

పాయల్ ఘోష్ మాట్లాడుతూ.. “ఒక బాలీవుడ్ దర్శకుడు సినిమా గురించి మాట్లాడాలని తన ఇంటికి పిలిచాడు. అతను మొదట నాతో చాలా ఫ్రెండ్లిగా మాట్లాడేవాడు. ఆ తరువాత తన పర్సనల్ రూమ్ కు తీలుకువెళ్లి చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బ్లూ ఫిలిమ్స్ కూడా చూపించాడు. తన దగ్గరకు ఏ హీరోయిన్ వచ్చినా కూడా ఇదే రూమ్ లోకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారని అసభ్యంగా మాట్లాడాడు. వెంటనే ఆరోగ్యం బాలేదని అక్కడి నుంచి నేను వెళ్లిపోయాను. ఇక డ్రగ్స్ ఏ హీరోలు తీసుకుంటారో కూడా నాకు తెలుసు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకొని డ్రగ్స్ తీసుకుంటే చాలని కొంతమంది హీరోలు వక్రబుద్దితో ఆలోచిస్తారు. ఏదైనా జరిగితే భవిష్యత్తులో చూసుకోవచ్చని మరికొందరు ఆలోచిస్తారు. కానీ అది నిజంగా చాలా తప్పుడు పని” అంటూ పాయల్ వివరణ ఇచ్చింది.