Powerstar: ప‌వ‌ర్‌స్టార్‌తో స్టార్ క‌మెడియ‌న్‌.. ఏన్నాళ్లాకు ఈ బంధం!

Powerstar: సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌, అలీ ప్రాణ‌స్నేహితులు అయినా విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ తొలి సినిమా నుంచి చివ‌ర‌గా కాట‌మ‌రాయుడు సినిమా వ‌ర‌కు అలీ ఆయ‌న‌తో క‌లిసి న‌టించారు. అలా వారి స్నేహం కొన‌సాగింది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ కు స‌పోర్ట్ ఇవ్వ‌కుంగా వైసీపీ లో జాయిన్ అయ్యాడు అలీ. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో చోటుచేసుకున్న కొన్ని ప‌రిణామాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రాలేదు.

powerstar ali

కాగా తాజాగా అలీ బంధువుల ఇంట జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి Powerstarప‌వ‌న్‌క‌ళ్యాన్ కూడా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌, అలీ న‌వ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అలీ స‌తీమ‌ణి జుబేదా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలను చూసి అభిమానులు వీరిద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ న‌టించాల‌ని కోరుకుంటున్నారు. ఇక Powerstarప‌వ‌న్‌క‌ళ్యాన్ రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూ.. మ‌రోవైపు సినిమాల‌తో బిజిబిజిగా గ‌డుపుతున్నాడు. ఇప్పుడు ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌లో న‌టిస్తున్నాడుPowerstar:.